నిజామాబాద్ ఎంపీ అరవింద్ కి కౌంటర్ ఇచ్చిన బాల్క సుమన్


 

తెరాస  ఎమ్మెల్యే బాల్క సుమన్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడం చేతకాదు కానీ, సీఎం కేసీఆర్ పై మాత్రం నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేని బీజేపీ నేతలు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ పిచ్చిపిచ్చిగా మాట్లాడడం మానుకోవాలని, ఆయనకు కుక్క కరిచిందో, లేక పిచ్చి ముదిరిందో అర్థంకావడంలేదని అన్నారు. ఎంపీ మాట్లాడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు రావాల్సిన నిధులు, పథకాలపై పార్లమెంటులో మాట్లాడకపోగా, ఎంతసేపూ ముఖ్యమంత్రిని, మంత్రులను పరుష పదజాలంతో వ్యక్తిగతంగా దూషిస్తున్నారని బాల్క సుమన్ ఆరోపించారు. ఐటీఐఆర్ నిలిపివేశామని పార్లమెంటు సాక్షిగా ఓ కేంద్రమంత్రి చెబితే ఒక్క బీజేపీ నేత కూడా స్పందించలేదని వెల్లడించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post