విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో ఎం.బి ఏ కోర్స్ లో ప్రవేశంనెల్లూరు జిల్లా: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం వారు జిల్లా లోని ఉద్యోగస్తుల మరియు  వారి ఉద్యోగాలలో  ప్రగతి సాధించుటకు  రెండు సంవత్సరాల కాల  వ్యవధి గల ఎగ్జిక్యూటివ్ ఎం.బి ఏ కోర్స్ ను ప్రవేశపెట్టడమైనది. డిగ్రీ పొంది నేరుగా ఉద్యోగ అవకాశాలు అందుకొని, సరైన పదోన్నతలు పొందలేక పోతున్న అభ్యర్థులు ఈ కోర్స్ ద్వారా నిర్వాహక మరియు నాయకత్వ నైపుణ్యాలను అందిపుచ్చుకోవచ్చని ఉపకులపతి ఆచార్య ఎం చంద్రయ్య విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కోర్స్ గురించి విభాగ అధిపతి డాక్టర్ జె విజేత మాట్లాడుతూ,   ఏ డిగ్రీయినా పాసై ఉండి, ఐదు సంవత్సరాల ఉద్యోగ అనుభవం కలిగి మరియు ఎగ్జిక్యూటివ్  ఆపై హోదాలో పనిచేస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరని తెలిపారు. ఉద్యోగస్తులు  మాత్రమే ఈ కోర్స్ కి అర్హులు కనుక వారి సౌకర్యార్థం తరగతులను సాయంత్రం వేళల్లో మరియు వారాంతపు రోజుల్లో  నిర్వహించబడును. ఆసక్తి గల  అభ్యర్థులు మార్చి  31 వ తేదీ లోగ దరఖాస్తు చేసుకొనవలెను  మరియు దరఖాస్తు రుసుము 1000/- రిజిస్ట్రార్, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పేరున డి.డి ద్వార చెల్లించగలరు. దరఖాస్తుతో పాటు  వారి విద్య మరియు ఉద్యోగ అనుభవం తెలిపే ధ్రువీకరణ పత్రాలను జతచేయగలరు. 

అప్లికేషన్ మరియు కోర్స్ గురించి పూర్తి  వివరాలను తెలుసుకొనుటకు  విశ్వవిద్యాలయం వెబ్సైటు www.simhapuriuniv.ac.in సందర్శించగలరు.

0/Post a Comment/Comments

Previous Post Next Post