తిమ్మాపూర్ లో ఘనంగా గడ్డం పుట్టినరోజు వేడుకలు...

 


కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం: మానకొండూర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఇంచార్జి గడ్డం నాగరాజు పుట్టినరోజు వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తిమ్మాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రం బస్టాండ్ వద్ద జరిగిన ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా అధ్యక్షులు జగదీశ్వరాచారి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా నియోజకవర్గంలోని కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ,పేద ప్రజలకు, ఆపదలో ఉన్నవారికి తన వంతుగా ఆర్థికంగా ఆదుకుంటూ బియ్యం పంపిణీ చేస్తూ బియ్యం నాగరాజు గా నిలిచిపోయాడని కొనియాడారు.చిరకాలం ఆరోగ్యంగా ఉంటూ నియోజకవర్గప్రజలకు మరిన్ని సేవలు అందించేలా భగవంతుడు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కిన్నెర అనీల్,జిల్లా ఈసీ సభ్యులు బూట్ల శ్రీనివాస్,మావురపు సంపత్,ఉపాధ్యక్షులు పబ్బ తిరుపతి,బోనాల వెంకటేష్, మార్క హరికృష్ణ గౌడ్, బిజెవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్,కాల్వ శ్రీనివాస్,పడాల రాజశేఖర్, రేగుల శ్రీనివాస్,గడ్డం శ్రీనివాస్ రెడ్డి,చింతల సంపత్ రెడ్డి,గొల్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post