గన్నేరువరం లో చిరుతపులి కలకలం - స్పందించిన ఫారెస్ట్ అధికారులు


 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చిరుత పులి ప్రవేశించింది అడవిలో ఉండే చిరుతపులులు ఊరి మధ్యలో కి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామంలో  చిరుత పులి , రెండు పిల్లలతో రాగా, అదే చిరుత పులి రెండు పిల్లలతో గన్నేరువరం మంగళవారం రోజు రాత్రి హరికృష్ణ రెడ్డి సంబంధించిన లేగదూడ పై దాడి చేసిందని రిపోర్టర్ టీవీ కి తెలపగా  

సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు  రేంజ్ ఆఫీసర్ గంటల శ్రీనివాస్ రెడ్డి తిమ్మాపూర్,గన్నేరువరం, చిగురుమామిడి ఇంచార్జ్ సుజాత  రెడ్డి, బుధవారం సంఘటనా స్థలానికి చేరుకొని పులి అడుగు జాడలను  వివిధ ప్రాంతాలలో పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ రైతులు తమ ఇంటి వద్దనే పశువులను కట్టేసుకుని తమ చుట్టూ కంచెను ఏర్పాటు చేసుకోవాలని అలాగే రాత్రి వ్యవసాయ బావి దగ్గరికి ఒక్కరు ఒకరు వెళ్లకుండా చూసుకోవాలని, చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు,

0/Post a Comment/Comments

Previous Post Next Post