గన్నేరువరం సత్య లక్ష్మి ఆలయంలో నూతన ఉత్సవ విగ్రహాలను చేయించి ఘనంగా ఊరేగింపు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని సత్య లక్ష్మి ఆలయంలో ఈరోజు కరీంనగర్ కు చెందిన పలువురు వైశ్యులు ఆలయానికి నూతన ఉత్సవ విగ్రహాలను చేయించి ఘనంగా ఊరేగింపు చేశారు. బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ, గ్రామ పురోహితులు మణి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఫల పంచామృత అభిషేకం, మహా నీరాజనం పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, అనంతరం స్థానిక గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని శాలువాతో ఘనంగా సత్కరించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ వాస్తవ్యులు తెలంగాణ రాష్ట్ర  వైశ్య ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గంజి స్వరాజ్య బాబు, సుధాకర్, శంకర్, పాత లింగన్న, బండి వీరన్న, వారి కుటుంబ సభ్యులు, స్థానిక వైశ్యులు, మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post