పాక్ చొరబాటుదారుడిని కాల్చి చంపిన బీఎస్ఎఫ్!

 


దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న పాకిస్థాన్ చొరబాటుదారుడిని బీఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపారు. ఈ ఘటన జమ్మూ సమీపంలోని సాంబా సెక్టారులో నిన్న ఉదయం జరిగింది. "ఉదయం 9.45 గంటల సమయంలో సరిహద్దుల వద్ద నిఘా విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లకు పాకిస్థాన్ కు చెందిన చొరబాటుదారుడు కనిపించాడు. చాక్ ఫక్విరా సమీపంలో సెక్యూరిటీ ఫెన్స్ దగ్గరకు వస్తూ కనిపించాడు. వెనక్కు వెళ్లాలని ఎన్నిసార్లు హెచ్చరించినా, ముందుకే వచ్చాడు. దీంతో అతన్ని ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చింది" అని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. ఆ తరువాత చొరబాటుదారుడి మృతదేహాన్ని భారత భూభాగంలో సరిహద్దుకు 40 మీటర్ల దూరంలో స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. కాగా, ఇదే ప్రాంతంలో గత సంవత్సరం నవంబర్ 23న చొరబాటుదారులను కాల్చి చంపగా, ఆపై పాకిస్థాన్ వైపు నుంచి ఇండియా వైపుకు తవ్విన సొరంగం వెలుగులోకి వచ్చింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post