ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం...32 మంది మృతి

 


ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. దక్షిణ కైరోకి సమీపంలో రెండు పాసింజర్‌ రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో 32 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 66 మందికి గాయాలైనట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దక్షిణ కైరోకు 460 కి.మీల దూరంలోని షోహాగ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో నాలుగు బోగీలు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఘటనా స్థలానికి 36 అంబులెన్స్‌లు చేరుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి డాక్టర్‌ ఖలీద్‌ మెజాహెద్‌ వెల్లడించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు చెప్పారు

0/Post a Comment/Comments

Previous Post Next Post