ఒమాన్ & మస్కట్ దేశంలోని బర్క సవాది ఏరియా 7బలదీయ క్యాంపులో GWAC సభ్యత్వ నమోదు కార్యక్రమం

 


గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో ఒమాన్ & మస్కట్ దేశంలోని బర్క సవాది ఏరియా 7బలదీయ క్యాంపులో GWAC సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్ లో 500 కోట్ల నిధి కేటాయించాలని మరియు సమగ్ర తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీని అమలు చేయ్యాలని కోరుతూ గల్ఫ్ లో చనిపోయిన బాధిత కుటుంబాలను ఆర్ధికంగా వారికి ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కేరళ తరహా పాలసీ తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలని తెలంగాణ గల్ఫ్ కార్మికుల సమస్యలను, బాధిత కుటుంబాల ఆవేదనను అర్ధం చేసుకొని హామీ ఇచ్చిన NRI పాలసీని అమలు చేయాలనీ కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చావనపెళ్లి కమలాకర్, ఉపాధ్యక్షులు గుంటుక శ్రీనివాస్,జనరల్ సెక్రటరీ కొత్త చిన్నయ్య, సలహాదారు స్వామినారాయణ, ఇంచార్జ్లు మగ్గిడి దిలిప్ కుమార్ ఆర్ల నవిన్,కోర్దినేటర్లు అవాదుత మహేశ్వర్ మరియు సినన్న, మల్లన్న,గంగారాం, మోహన్, శ్రీనివాస్, దేవరాజ్, మోగిలయ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post