ఎల్ ఎన్ ఆర్ ట్రస్ట్ తరుపున వి యస్ యు రిజిస్ట్రార్ అల్పాహార వితరణ

 


తన సోదరుడు లేబాకు గోపాల కృష్ణ రెడ్డి దంపతుల 16 వ వర్ధంతి పురస్కరించుకొని లేబాకు నారాయణ రెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్.విజయ కృష్ణ రెడ్డి నెల్లూరు లోని కొండాయపాలెం రోడ్డు లో ఉన్న జనహిత వాత్సల్య ట్రస్ట్ కు చెందిన విద్యార్థులకు వృద్దులకు గురువారం ఉదయం అల్పాహార వీతరణ చేశారు.కృషీవలుడు,ఆదర్శ రైతు అయిన తమ సోదరుడు అనారోగ్యంతో లోకాన్ని వీడారని,ఆ చింతతో తమ వదిన ప్రభావతమ్మ అసువులు బాసారని వారి జ్ఞాపకర్ధం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.పిల్లలందరికీ ఆయన తన మిత్రులతో కలిసి అల్పాహారాన్ని వడ్డించారు ఏటా ఇదే రోజు వై.యస్.ఆర్ కడప జిల్లా వంటిమిట్టలో ఉన్న శ్రీ కోదండరామ స్వామి నిత్య అన్నదాన క్షేత్రంలో తమ అన్న,వదినల పేరిట భోజన వితరణ జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అధ్యాపకులు డా అల్లం ఉదయ్ శంకర్,డా సుబ్బారెడ్డి ,షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post