సామాజిక తనిఖీ బృందం అద్వర్యం లో గ్రామసభ

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని పీచుపల్లి గ్రామం లో శనివారం సామాజిక తనిఖీ బృందం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం కూలీల, పాలక వర్గం సమక్షంలో గ్రామసభ నిర్వహించారు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిధులతో  గ్రామంలో నర్సరీ,చెట్ల పెంపకం, వివిధ రకాల చేశారు. గ్రామం లో పలు రకాల పనులను కూలీలతో చేయించారు సంవత్సరం పాటు జరిగిన పనులపై సామాజిక తనిఖీ బృందం జరిగిన పనులపై తనిఖీ నిర్వహించారు, తనిఖీ నివేదికలను గ్రామసభ లో చదివి వినిపించారు. చేసిన పనులకు కూలీ డబ్బులు త్వరగా ఇప్పించాలని,పనులు కల్పించాలని ఉపాధి హామీ కూలీలు సామాజిక తనిఖీ బృందాన్ని కోరారు. ఈ సమావేశంలో సర్పంచ్ పీచు చంద్రారెడ్డి, ఉపసర్పంచ్ బోయిని వెంకటేష్ ,వార్డు సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post