ఘోర రోడ్డు ప్రమాదం ప్రయాణికులకు తీవ్ర గాయాలు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో  గుండ్లపల్లి బస్టాండ్ వద్ద హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు వస్తున్నటువంటి కారు డ్రైవర్ బాల స్వామి గౌడ్ తన కారును అతి వేగంగా మరియు అజాగ్రత్తగా  నడుపుకుంటూ గుండ్లపల్లి స్టేజి మీద ఆగి ఉన్నటువంటి ద్విచక్రవాహనం ,సైకిల్ మరియు ఆటోలను ఢీకొనగా ద్విచక్ర వాహనదారులు టేకు శ్రీకాంత్,  టేకు నర్సయ్య మరియు  ఆటో లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ కాంపల్లి కుమార్, గడ్డం శంకర్, తోట నరేందర్ , తోట దీవన (5)లకు తీవ్ర  గాయాలు అవగా ఆసుపత్రికి తరలించడం జరిగింది ఇట్టి సంఘటనపై ఆటోడ్రైవర్  కంపెల్లి కుమార్ తండ్రి  కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు

0/Post a Comment/Comments

Previous Post Next Post