వి యస్ యు లో సుసంపన్న వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులను ప్రారంచించిన జిల్లా సంయుక్త కలెక్టర్ M N. హరేంద్ర ప్రసాద్

 


విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సోషల్ వర్క్ విభాగం ఆధ్యర్యంలో వృత్తి  నైపుణ్యలపై రెండు రోజులు పాటు జరిగే జాతీయ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ M N. హరేంద్ర ప్రసాద్ గారు ప్రారంబించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ  ఆచార్య రొక్కం సుదర్శన రావు గారు మాట్లాడుతూ ప్రతి వృత్తి లో నైపుణ్యాలను కల్గి వుంటేనే అ సంస్ధ అభివృద్ధిలోకి రాగలుగుతాయి అని విద్యార్ధి దశ నుంచే వారు  చదువుచున్న కోర్సులకు అనుగుణంగా నైపుణ్యాలను అలవరచుకోవాలని తెలయజేశారు. ఈ కార్యక్రమానికి  విశిష్ట అతిధిగా విచ్చేసిన జిల్లా సంయుక్త కలెక్టర్ M N. హరేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ విద్యార్ధులు సామన్య ప్రజానీకం జీవన స్ధితి గతులను మార్చ గలిగే నైపుణ్యాలపై శ్రద్ధ వుంచాలని ప్రజలతో మమేకమై  నైపుణ్యాల ద్వారా వారిలో మార్పు తీసుకురావలని తెలిపారు. గౌరవఅతిధిగా విచ్చేసిన యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్  ఎల్ విజయ క్రిష్ణ రెడ్డి గారు మాట్లాడతూ విద్యార్ధులకు,సమాజానికి ఉపయోగపడే ఇలాంటి శిక్షణ తరగతులను నిర్వహిరచిన సోషల్ వర్క్ విభాగాన్ని అభినందించారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పాపు లేషన్ స్టడీస్ సోషల్ వర్క్ విభాగాపు ఆచార్యలు డి సాయి సుజాత గారు శిక్షణ తరగతులకు హాజరైన వారికి  సమాజంలోని సమస్యలను అధ్యయనం చేయడం లోను వాటికి పరిస్కారమర్గాలను చూపడం ఎలా అన్న దానిపై కొన్ని  నైపుణ్య అంశాలను విపులంగా తెలియజేసారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజా నాయర్ అద్యక్షత వహించారు.  కార్యక్రమంలో సమన్వయ కర్త డాక్టర్ సునీత, సహాయ  సమన్వయ కర్త డాక్టర్ బి. వి. సుబ్బారెడ్డి, డాక్టర్ పి.సుబ్బరామరాజు,ఎ.వి.యస్. ప్రసన, పి.సంధ్య, జాతీయ సేవా పధకం NSS సమన్వయ కర్త డాక్టర్ ఉదయ శంకర్,IQSE సమన్వయ కర్త డాక్టర్ కిరణమై,మరియు భోద,భోధనేతర సిబ్బంది, విద్యార్ధిని, విద్యార్ధులు తదితరులు పాల్గొనారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post