ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఆదివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకుడు కొండా చరణ్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరు సమాన హక్కులతో జీవించాలని తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని, మనువాదా కబంధ హస్తాల్లో నలిగిపోతున్న స్త్రీ జాతికి చైతన్య జ్వాలని రగిలించి, స్త్రీలకు చదువు అవసరాన్ని తెలియజేసి, విద్యాబోధన చేసిన మహోపాధ్యాయుడు జ్యోతిరావు అని కొనియాడారు. అంటరానితనం, కుల వివక్షత రూపుమాపడం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి, సతీసాహగమనాన్ని నిర్ములించాలని, మూఢ విస్వాసాలు సమాజ తిరోగమనమేనని ప్రజలకు బోధించిన తత్వవేత్త పూలే అని ఆయన  అన్నారు.

సమాజంలోని రుగ్మతలను రూపుమాపాలని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువా వంటి తరతమ్యాలు ఉండకూడదని,నేటి సమాజ పోకడకు పూలేను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో నడవాలని చరణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు అలవాల రాజమ్మ, మచ్ఛా రామారావు, సభ్యులు ఐనవోలు శ్రీను, శంకర్, ముత్తయ్య, రాజు, చంటి, సాయి కుమార్, వీరేంద్ర, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post