తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్

 


 సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ముఖ్యమంత్రికి కరోనా సోకిందని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు. కాగా, హోం ఐసోలేషన్ లో ఉండాలని కేసీఆర్ కు వైద్యులు సూచించారు.ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో ఉన్నారని,  ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం ఎప్పటికిప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తోందని సీఎస్ సోమేశ్ కుమార్ వివరించారు. రెండు వారాల కిందట సీఎస్ సోమేశ్ కుమార్ కు కరోనా పాజిటివ్ వచ్చింది.0/Post a Comment/Comments

Previous Post Next Post