చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్ల దారుణ హత్య ! ఛత్తీస్గఢ్ మరో దారుణం జరిగింది. ఇక్కడి సుక్మా జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు నిన్న దారుణ హత్యకు గురయ్యారు. బెజ్జి పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ కానిస్టేబుళ్లు పూనెం హరీమ్ (29), ధనిరాం కశ్యప్ (31) బైక్‌పై సమీప గ్రామంలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు.తిరిగి వస్తున్న సమయంలో వారి బైక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి మారణాయుధాలతో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. హత్య చేసింది మావోయిస్టులా? లేక, పాతకక్షల నేపథ్యంలో మరెవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.


                                      పుట్టు గొడ్రాలికి కూడా సంతానం కలిగే మూలిక
0/Post a Comment/Comments

Previous Post Next Post