హన్మాజిపల్లి గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని హన్మాజిపల్లి గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు అమ్మి గల్ల సుధాకర్ మాట్లాడుతు మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సామాజిక విప్లవకారుడు. శూద్రుల, మహిళ ల ఆశాజ్యోతి కుల వ్యవస్థపై తిరగబడి కాంతి సూర్యుడి గా వెలుగొందిన సంఘసంస్కర్త జ్యోతిరావు మాలి కులస్తులు. గోవిందు చీమ నా బాయ్ దంపతులకు 11/04/1827 జన్మించాడు.1834-38 మధ్య ప్రాథమిక విద్య ముగించాడు. బ్రాహ్మణ కుతంత్రాల కారణంగా బడిమాని వ్యవసాయం చేశాడు తర్వాత పూలకొట్టు లో పని చేశాడని1840 లో సావిత్రిబాయి పూలే తో చిన్న వయసులోనే వివాహం చేసుకున్నాడు అప్పుడు తన వయసు 13 సంవత్సరాలు సావిత్రిబాయి కి 9 సంవత్సరాలు ఇలా కావడానికి వెనుకబడిన జాతులు చదువు లేకపోవడం ముఖ్య కారణం. జ్యోతిబా ఉత్సాహాన్ని గమనించిన పర్షియన్ పండితులు మున్షి గపార్ బెగ్ బ్రిటిష్ ఉద్యోగి లిజిత్ సాహెబ్ అతడికి బంగారు భవిష్యత్తు ఉందని అతనికి చదువు అవసరం అని వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి1841 మూడేళ్ల విరామం తర్వాత ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు1848లో జ్యోతిబా జీవితంలో మరిచిపోలేని సంఘటన జరిగింది. తన మిత్రుడి వివాహంలో ఉన్నత కులస్థులు అతడిని కులం పేరుతో అవమాన పరిచారు ఈ సంఘటనతో శూద్రులకు వైశ్య శూద్రులకు విద్య ఎంతో అవసరమని భావించి స్త్రీలకు బాలికలకు పాఠశాలలు ఏర్పాటు చేశాడు తొలి భారతీయుడు సతీ సహగమనం దేవదాసీ వ్యవస్థను వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి రైతులకు పన్ను రద్దు కోసం పోరాటం చేశాడు. బ్రాహ్మణీయ వడ్డీ వ్యాపారుల ఉచ్చులో పడకుండా రైతులకు చైతన్య పరిచిన వ్యక్తి. విద్యా హక్కు గురించి ప్రచారం చేశారు తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే విద్య నేర్పి శ్రీల అభ్యున్నతికి కృషి చేసేలా చేశాడు 1873లో సత్యశోధక్ సమాజ్ స్థాపించాడు. ఇంకా జ్యోతిబాపూలే సామాజిక ఉద్యమకారుడు తత్వవేత్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు .. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు పైసా రాజు. అమ్మి గల్ల నాగరాజు. దేవా పరుశరాములు పారు నంది సుమన్. గణేష్. ఎనగందుల గణేష్. శివుడ్ల అనిల్. మహేష్. ప్రజలు  పాల్గొన్నారు.


                                  ఆముదంలో ఒక్కరోజు ఇలా చేస్తే మలబద్దకం పరార్0/Post a Comment/Comments

Previous Post Next Post