కారులో మంటలు.. తెరిచి చూస్తే షాక్!

 


రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్‌పై కారులో మంటలు చెలరేగాయి. ఓఆర్‌ఆర్‌పై కారు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కారు ఇంజిన్ భాగంలో గంజాయిని తరలిస్తుండగా మంటలు వచ్చాయి. కారును వదిలేసి దుండగులు పరారయ్యారు. కారులోని మంటలను వాహనదారులు, స్థానికులు కలిసి ఆర్పారు. విజయవాడ నుంచి గంజాయి రవాణా చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post