మీడియా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ 


➡️జిల్లాలో సగానికి పైగా వరికోతలు పూర్తెన ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు


➡️ఎమ్మెల్యేలు మంత్రులు కొబ్బరికాయ కొట్టి ఫోటోలు దిగి ప్రారంభించాo అని చెబుతున్నారు తప్ప ఎక్కడ కూడా కొనుగోలు చేయడంలేదు


➡️అరుగాలం కష్టపడి పండించిన పంట ప్రభుత్వ కొనుగోలు చేయక అలసత్వం చేయడం వల్ల వర్షాలు వచ్చి ధాన్యం తడిస్తే దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి


➡️ఈసారి జిల్లాలో వరిపంట దిగుబడి ఎక్కువ వచ్చిన కొనుగోలు విషయంలో ప్రజాప్రతినిధులు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం బాధాకరం


➡️గత సంవత్సరం కూడా ధాన్యం కొనుగోలు చేసిన తాలు తప్ప పేరుతో రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసారు


➡️సివిల్ సప్లై మంత్రి స్వంత జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఏ విధమైన పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవాలి


➡️ఇప్పటికైనా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ళను వేగవంతం చేసి ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రతి గింజ కొనుగోలు చేయాలనీ లేని పక్షంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, గ్రామాల్లో తిరుగకుండా అడ్డుకుంటాం అని హెచ్చరించారు


➡️కరోనా వైరస్ తీవ్రంగా విజ్రంబిస్తున్న ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు


➡️కనీసం రాష్ట్రంలో కరోనా పెషేంట్లకు బెడ్లు కూడా ఇవ్వలేని దయనియమైన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది 


➡️ప్రభుత్వనికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ద రైతుల మీద కరోనా రోగుల మీద లేదు అన్నారు


➡️ప్రజలు కూడ మాస్క్ ధరించి బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు పాటించాలి అన్నారు


కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్.ఎల్ గౌడ్, మండల అధ్యక్షులు రావి సతీష్, జిల్లా కార్యదర్శి గోపగోని బస్వయ్య, జిల్లా అధికార ప్రతినిధి ఊకంటి మధుకర్,యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,కిసాన్ సెల్ మండల అధ్యక్షులు రాజిరెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు చింతిరెడ్డి పద్మ, మైనారిటీ అధ్యక్షులు జహంగీర్, ఎస్సి సెల్ అధ్యక్షులు చంద్రమౌళి,గ్రామ కమిటీల అధ్యక్షులు సంతోష్, శ్రీనివాస్,నాయకులు కల్లేపల్లి రాజయ్య, శ్రీనివాస్, సాంబయ్య,సాగర్,యూత్ కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి ఇసముద్దీన్,అమర్,షారుక్ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post