మిడ్ మానేరు జలాశయం నుండి నీళ్లు విడువక పంట పొలాలు ఎండుతూన్నా పట్టించుకోని రాష్ట ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో  మిడ్ మానేరు లో కుడి కెనాల్ ద్వారా తోటపెల్లి రిజర్వాయర్ కు వెళ్తున్న పెద్ద కెనాల్ గాలిపెల్లి వద్ద సరఫరా -4 వద్ద నీళ్లు విడవక పోవడంతొ పంటలు ఏడుంతున్న పట్టించుకోవటం లేదని బీజేపీ  మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతి రెడ్డి  అన్నారు ఆయన మాట్లాడుతూ  ఇల్లంతకుంట మండలం లో  మిడ్ మానేరు జలాశయాలంలో ప్రస్తుతం 16 టీఎంసీ నీళ్లు వున్నా రోజు  600 కుసెక్కులనీళ్లు కుడి కాలువ ద్వారా తోటిపెల్లి రిజర్వాయర్కు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారన్నారు,డ్యామ్ లు ఉన్నా  మన ఇల్లంతకుంట మండలంలో ని  పంట పొలాలకు మాత్రం నీళ్లుని వదలరాంటూ  దొర ఏమో తన భూములకు డ్యామ్ ల నుండి నీళ్లు తీసుకోనిపోతుంటే  ఎమ్మెల్యే  కనీసం ఈ చిన్న సరఫరా-4  కెనాల్ కీ నీళ్లు విడిపించాలేరా అంటూ మండిపడ్డారు, వెంటనే ఈ డిస్తూబ్యూటరీ కెనాల్ -4  ద్వారా నీళ్లు విడిపించలన్నారు దీనివల్లనా గాలిపెల్లి నర్సక్కపేట, జవారిపేట  గ్రామాల పంట భూముల   3199 ఎకరాలకు నీళ్లు వస్తాయిఅన్నారు, రెండు రోజులలో నీళ్లు ఎమ్మెల్యే విడిపించలేకపోతే రైతులతో కలిసి ప్రజాఆందోళన కార్యక్రమం చేస్తామన్నారు ఈ కార్యక్రమం లో గజ్జల శ్రీనివాస్, తిప్పారపు శ్రవణ్, పల్లె సాయి ప్రసాద్ రెడ్డి, చల్లూరి భాను,నర్సయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post