ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం....కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు వారు

 


హైదరాబాద్  వనస్థలిపురంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నిన్న ఉదయం నుంచి తమ కుమార్తెలు ఐశ్వర్య (17), ఆస్మా (15), అబీర్ (14) కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.స్థానిక ప్రగతినగర్‌కు చెందిన రమేశ్, అతడి స్నేహితులపై అనుమానం వ్యక్తం చేశారు. రమేశ్ గతంలో ఐశ్వర్య వెంటపడేవాడని, ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఐశ్వర్యను వేధిస్తున్న రమేశ్‌ను గతంలో తాము హెచ్చరించామని కూడా చెప్పారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కిడ్నాపైన బాలికల కోసం ఆరా తీస్తున్నారు.

                                   థైరాయిడ్, నెలసరి సమస్యలకు ఈ చెట్టు దివ్వౌషదం 

0/Post a Comment/Comments

Previous Post Next Post