మైలారం గ్రామంలో పోచమ్మ బోనాలు - బోనం ఎత్తుకున్న కరీంనగర్ కార్పోరేటర్ తోట రాములు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఆదివారం మైలారం గ్రామంలో మున్నూరు కాపు కుల బంధువుల ఆధ్వర్యంలో  పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కరీంనగర్ నగరపాలక సంస్థ  12వ డివిజన్  కార్పొరేటర్ తోట రాములు బోనం ఎత్తుకొని ఊరి చివర ఉన్న పోచమ్మ తల్లికి  మొక్కులు సమర్పించుకున్నారు మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని గ్రామ శివారులో ఉన్న పోచమ్మ తల్లి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు కరీంనగర్ కార్పోరేటర్ తోట రాములు ను శ్రీ మైలారం మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ వరాల పరుశరాములు శాలువాతో సత్కరించారు ఈకార్యక్రమంలో గంగుల యువసేన జిల్లా అధ్యక్షుడు తోట కోటేశ్వర్,వరాల మల్లేశం, కుల బంధువులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు

                                   ఆముదంలో ఒక్కరోజు ఇలా చేస్తే మలబద్దకం పరార్0/Post a Comment/Comments

Previous Post Next Post