కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర ఓల్డ్ ఏజ్ హోమ్ కు ఫ్రెండ్స్ ఫరెవర్ కిట్టి బృందం లక్ష్మీదేవి పల్లి సర్పంచ్ కరివేద పద్మజా శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో రూ. 15 వేల ఆర్థికసాయం అందజేశారు. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వహణ కష్టంగా మారినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలకు స్పందించిన ఫ్రెండ్స్ ఫరెవర్ కిట్టి బృందం ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకుడికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ కరివేద పద్మజా శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల మీడియాలో వచ్చిన కథనాన్ని చూసి తమ కిట్టి గ్రూప్ లో చర్చించుకోవడం జరిగిందన్నారు. గ్రూప్ సభ్యుల సహకారంతో 15 వేల రూపాయల చిన్న సాయాన్ని నిర్వాహకుడి అందజేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా కరీంనగర్ లో ఇలాంటి గ్రూపులో ఎన్నో ఉన్నాయనీ, వారంతా కలిసి తమకు తోచిన సాయం చేస్తే నిర్వాహకులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే తన కోరిక మేరకు ఓల్డేజ్ హోమ్ కు ఆర్థిక సాయం అందజేసిన సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Related News :
ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావు పల్లె శనివారం బిక్కవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను ఎస్సై ఆవుల తిరుపతి పట్టుకొని ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించి మైనింగ్ డిపార్ట్మెంట్ కు అప్పగించారు ఎవరైనా పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఆవుల తిరుపతి హెచ్చరించారు Post Views: 108
బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నియామకం
ఐపీఎస్ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ప్రమోషన్ దక్కింది. రాజకీయాల్లోకి వస్తూ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)లో చేరిన ఆయనను పార్టీ అధినేత్రి మాయావతి నాడు తెలంగాణ శాఖకు కన్వీనర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ హోదాలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలో పాదయాత్ర చేపడుతున్నారు. ఈ క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు ప్రమోషన్ కల్పిస్తూ బీఎస్పీ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్పీ తెలంగాణ శాఖకు ఆయనను […]
రాజ్ కోటి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్మోహన్ రావు
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోటర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు బుర్ర రాజ్ కోటి నానమ్మ సీనియర్ జర్నలిస్టు బుర్ర అంజయ్య తల్లి బుర్ర లస్మమ్మ మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మాజీ జెడ్పిటిసి జువ్వాడి మన్మోహన్ రావు, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్ శుక్రవారం పరామర్శించారు మృతికి గల కారణాలు తెలుసుకొని ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు బుర్ర మల్లయ్య, బుర్ర రమణ ఉన్నారు Post Views: 66