అనాధ చిన్నారికి 2000 రూపాయల ఆర్థిక సహాయం బియ్యం అందజేసిన గడ్డం నాగరాజు కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని పచ్చనూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో నెలవేని లింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు కొన్ని రోజుల క్రితమే వారి భార్య నేలవేణి పూలమాల  కూడా మృతి చెందడంతో తల్లిదండ్రులను ఇద్దర్ని కోల్పోయి నెలవేని ప్రియాంక  అనాధగా మారింది.  శనివారం ఆ కుటుంబ సభ్యులను బిజెపి మానకోండూర్ నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు  పరామర్శించి ఆమెకు అన్ని రకాల అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం 50 కిలోల జైశ్రీరామ్ బియ్యం మరియు 2000/- రూపాయల  ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్, దళిత మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సిరిసిల్ల చంద్రయ్య, మండల ప్రధాన కార్యదర్శి సోన్నాకుల శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు కంది రాజిరెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు పూసల బోస్, పిట్టల సదానందం, దళిత మోర్చా మండల కార్యవర్గ సభ్యులు ఎలకపల్లి చొక్కారావు కిసాన్ మెర్చా మండల కార్యదర్శి పిన్నింటి రాజేందర్ రెడ్డి, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు ఉయ్యాల శశిదర్ నాయకులు: ఆరేపల్లి క్రాంతి కుమార్, దాసారపు సురేష్, బాలగోని శ్రీనివాస్, జ్యోతి రావు తదితరులు పాల్గొన్నారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post