TELANGANA

లాక్ డౌన్ నింధనలు ఉల్లగిస్తే కఠిన చర్యలు తప్పవు : ఎస్ఐ ఆవుల తిరుపతి

 గ్రామాల్లో వాహనదారులకు జరిమానాలు  ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని ఎవరైనా ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ఆవుల తిరుపతి అన్నారు, గురువారం గన్నేరువరం  మండలంలోని మైలారం , హన్మాజిపల్లి , జంగపల్లి గ్రామాల్లో వాహనదారులను తనిఖీ చేసారు . మాస్కులు లేకుండా వాహనాల పై  తిరుగుతున్న పలువురి వాహనదారులకు జరిమానాలు విధించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి గ్రామాల్లో వేగంగా విస్తరిస్తుందని ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తుండగా ప్రతి ఒక్కరు ఉదయం 6 నుండి 10 గంటల వరకు అవసరం మేరకు భయటకు రావాలని విధిగా ప్రతి ఒక్కరు మాస్కు  ధరించాలని సూచించారు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంగించి గ్రామాల్లో ఎవరైన 10 తర్వాత ద్విచక్రవాహనాల పై తిరుగుతూ పోలీసుల కంట పడితే వాహనాలు  సీజ్ చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.