పదో తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అయితే, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వెబ్సైట్లో పదో తరగతి ఫలితాలు అందుబాటులో ఉంటాయి. bse.telangana.gov.inతో పాటు పలు వెబ్సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చు.ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ… మొత్తం 535 పాఠశాలలు 10 జీపీఏ సాధించాయని చెప్పారు. విద్యార్థుల పరంగా చూస్తే మొత్తం 2,10,647 మంది 10 జీపీఏ సాధించినట్లు ఆమె వివరించారు. పరీక్ష రుసుము చెల్లించిన 5,21,073 మందిని ఉత్తీర్ణులు చేసి గ్రేడ్లను ఖరారు చేశారు. కరోనా విజృంభణ కారణంగా ఈ ఏడాది కూడా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులకు కొన్ని నెలల క్రితం వారి పాఠశాలల్లో నిర్వహించిన ఫార్మేటివ్ అసెస్మెంట్-1లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుని మార్కులు ఇచ్చారు. తుది మార్కులు కేటాయించి గ్రేడ్లను ఖరారు చేశారు. విద్యార్థులకు ఆయా సబ్జెక్టులలో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్, గ్రేడ్ పాయింట్లు ఇచ్చారు. అన్ని సబ్జెక్టులకు కలిపి గ్రేడ్ పాయింట్ యావరేజ్ ను నిర్ణయించారు.
Related News :
బ్యాంక్ రుణాలు తీర్చని రైతుల ఫొటోలు, పేర్లను నడి వీధిలో ఫ్లెక్సీల్లో వేయించిన అధికారులు!
మెదక్ జిల్లా కోఆపరేటివ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రైతుల పరువు తీసే ప్రయత్నం చేశారు. పాపన్నపేట మండలంలో రుణాలు చెల్లించని రైతుల పేర్లు, ఫొటోలతో నడి వీధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.కొందరు రైతులు వ్యవసాయ పైపులైన్లు, గేదెలు, కోళ్ల ఫారాల ఏర్పాటు కోసం గతంలో రుణాలు తీసుకున్నారు. అయితే, గత ఏడాది కరోనా విజృంభణ, భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అప్పులు తీర్చడానికి సమయం ఇవ్వాలని రైతులు కోరారు. తమపై కనికరం చూపకుండా వారి […]
హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం
హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆయన టీపీసీసీకి తన రాజీనామా లేఖను పంపనున్నట్టు సమాచారం. ఈ రోజు కౌశిక్ రెడ్డి ఓ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో లీక్ కావడం కలకలం రేపింది. తనకు టీఆర్ఎస్ టికెట్ ఖాయమైందని ఆయన అందులో వ్యాఖ్యానించారు. ఈ ఆడియో టేప్ బయటకు […]
అన్ని గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని శాసనసభ్యులు రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ యువ సేవ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జడ్పిటిసి సభ్యులు మాడుగుల రవీందర్ రెడ్డి ,టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి తో కలిసి ప్రారంభించారు జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి కి తొలి సభ్యత్వం అందజేసిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ఈ సందర్భంగా జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సభ్యత్వ నమోదు […]