సీబీఐకి కొత్త డైరెక్టర్ వచ్చేశారు. మొత్తం 109 మందిని వడపోసిన త్రిసభ్య కమిటీ చివరికి మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్‌ను ఎంపిక చేసింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, లోక్‌సభలో విపక్ష నేత అధీర్ రంజన్ చౌధురిలతో కూడిన త్రిసభ్య కమిటీ సుదీర్ఘ వడపోత అనంతరం జైశ్వాల్‌ను ఎంపిక చేసింది.నిజానికి సీబీఐ నూతన డైరెక్టర్ పదవి రేసులో సుబోధ్ కుమార్ ముందు నుంచి ఉన్నారు. సశస్త్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ కేఆర్ చంద్ర, కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి వీఎస్కే కౌముది కూడా పోటీలో నిలిచినప్పటికీ సుబోధ్ కుమార్ అత్యంత సీనియర్ కావడంతో ఆయనకే ఈ పదవి దక్కింది. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న రిషికుమార్ శుక్లా ఫిబ్రవరిలోనే పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి పూర్తిస్థాయి డైరెక్టర్ లేకుండానే సీబీఐ పనిచేస్తోంది.
Related News :
బుద్ది మార్చుకోని చైనా.. సరిహద్దుల కు సైన్యం మోహరింపు
తన బుద్ధిని మార్చుకోము చైనా . సరిహద్దుల వద్దకు మళ్లీ చైనా సైన్యం విన్యాసాలు ప్రారంభించింది. భారత్ కరోనాతో అల్లాడిపోతోన్న సమయంలో చైనా ఈ తీరును ప్రదర్శిస్తుండడం గమనార్హం. తూర్పు లఢఖ్ సెక్టార్‌కు సమీపంలో చైనా సైనిక విన్యాసాలు చేస్తుండడాన్ని భారత్ గుర్తించింది. చైనా సైన్యం తీరును నిశితంగా పరిశీలిస్తోంది. సరిహద్దుల మీదుగా కొన్ని గంటల్లోనే భారత్ లోకి ప్రవేశించేందుకు వీలు ఉన్న ప్రాంతాల్లో చైనా సైన్యం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.అంతేగాక, ఆయా ప్రాంతాల్లో మౌలిక […]
“అక్రిడిటేషన్ లేని వారు కూడా విలేఖరులే”
కేంద్ర ప్రభుత్వం గుర్తించిన,RNI సర్టిఫికెట్ కలిగిన, పత్రికల్లో పనిచేసే వారు విలేఖరి లే.. మరి RNI సర్టిఫికెట్ దానికి ఎటువంటి విలువ లేదా? వారు సంపాదకులు కాదా? అక్రెడిటిటేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన R.N.I.కె విలువ ఎక్కువ. అక్రెడిటిటేషన్ బస్సులో ప్రయాణించడానికి, రైలు లో ప్రయాణించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది… ఎడిటర్ ఇచ్చే పాస్ కి విలువ ఎక్కువ. అక్రెడిటిటేషన్ బ్రహ్మ పదార్థమైనట్లు అక్రెడిటిటేషన్ ఉంటేనే వారు జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది […]
బాణసంచా కర్మాగారంలో భారీపేలుడు….ఏడుగురి దుర్మరణం
బాణసంచా కర్మాగారాలకు నిలయమైన తమిళనాడులో అనేక ప్రమాదాలు జరిగినా జాగ్రత్త చర్యలు శూన్యం అని చాటుతూ మరో దుర్ఘటన జరిగింది. విరుదునగర్ జిల్లాలోని సత్తూరు సమీపంలోని సిప్పిప్పారై వద్ద ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, మరో ఏడుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. మృతి చెందిన వారిలో ఆరుగురు మహిళలున్నారు. పేలుడు తీవ్రతకు కర్మాగారం పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను సహాయ సిబ్బంది బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి […]