ఎపి డిజిపి కి ఎన్ హెచ్ఆర్ సీ నోటీసులు ... 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలి ఎంపీ రఘురామకృష్ణరాజును ఇటీవల ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం, తనను పోలీసులు కొట్టారంటూ ఆయన కోర్టుకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించాయి. ఇటీవలే సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందిన రఘురామ... సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, తన తండ్రిని అరెస్ట్ చేసిన తీరు, తదనంతర పరిణామాలపై రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) కు ఫిర్యాదు చేశారు.  దీంతో స్పందించిన ఎన్ హెచ్ఆర్ సీ ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా బదులివ్వాలని స్పష్టం చేసింది. ఏసీబీ కస్టడీలో రఘురామపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలపై అంతర్గత విచారణ జరపాలని సీఐడీ డీజీని ఆదేశించిన మానవ హక్కుల కమిషన్, జూన్ 7 లోగా ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది.0/Post a Comment/Comments

Previous Post Next Post