మంత్రి ఈటెల రాజేందర్ బర్తరఫ్ పై బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్దం  •   బీసీల ఎదుగుదలను ఓర్వలేకనే ఈటల పై కుట్ర
  • రామేశ్వరుడికో న్యాయం రాజేంద్రుడికి ఒక న్యాయమా...!
  •  జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు


సిద్దిపేట జిల్లా : మే02,(కోహెడ మండలం) స్థానిక అంబెడ్కర్ చౌరస్తాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా రాజు మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసిన తరువాత బీసీల ఆరాధ్యదైవం ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ పైన సీఎం కేసీఆర్ కుట్రలు పన్నారని ఆరోపించారు. విచారణ కమిటీ పూర్తి నివేదిక సమర్పించకుండానే ఈటలను  మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం చాలా దుర్మార్గపు చర్యగా ధ్వజమెత్తారు. కేసీఆర్ మంత్రి వర్గంలో భూమి కబ్జాలు చేస్తున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మంత్రి మల్లారెడ్డి, పువ్వాడ ఇంకా ఏంతో మంది ఎమ్మెల్యేలు కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎవరి పైన విచారణ కమిటీలు వేయకుండా కేవలం బీసీ మంత్రి రాష్ట్రంలో అతడికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈటల రాజేందర్ ను అణచివేసే ఉద్దేశ్యంతో అతనిపై విచారణ కమిటీ నివేదిక రాకుండానే బర్తరఫ్ చేయడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మొదటి నుంచి ప్రతి ఉద్యమానికి నాయకత్వం వహించి, టీఆరెస్ పార్టీ ఆవిర్భావానికి ఎంతో కృషి చేసిన ఈటల రాజేందర్ రాష్ట్రంలో ఇప్పటి వరకు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యే గా గెలుపొందిన మచ్చ లేని నాయకుడిగా ఎస్సి, ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాల మన్నులు పొందుతున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి గా రాష్ట్రంలో విపత్కర పరిస్థితిలో కంటి మీద కునుకు లేకుండా అహర్నిశలు కృషి చేస్తున్న ఈటల ను ఓర్వలేక మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారన్నారు.ఈటల రాజేందర్ ను తక్షణమే మంత్రి వర్గంలోకి తీసుకోవాలని లేకుంటే రాష్ట్ర జనాభాలో 90%  ఉన్న బీసీ, ఎస్సి, ఎస్టీ మైనార్టీ ప్రజలు ఆగ్రహానికి టీఆరెస్ ప్రభుత్వం గురి కాక తప్పదని హెచ్చరించారు.

ఈటల రాజేందర్ పై కక్ష పూరిత చర్య జరుగుతుందని ,తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎన్నో కష్ట నష్టాలకోర్చి ఉద్యమకారులపై జరిగిన కేసులకు తన స్వంత ఆస్తులు అమ్మి ఖర్చులు భరించాడని, అలాంటి నికార్సయిన ఉద్యమకారుడిపై అబద్దాలు ప్రచారం చెయ్యడం సిగ్గుచేటని మండిపడ్డారు.ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈటల రాజేందర్ బాటలో నడుస్తామని,బీసీల ఆత్మగౌరవం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దం అని రాజు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు వేల్పుల శంకర్,జాతీయ బీసీ సంక్షేమ సంఘం సీనియర్ నాయకులు శనిగరం యాదగిరి,జాలిగం లక్ష్మయ్య,జీ. మల్లయ్య, గౌరబోయిన చంద్రయ్య బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post