సరైన వైద్యం అందక గర్భస్థా కవలలు మరణించిన సంఘటనపై స్పందించి విచారణ చెప్పట్టిన రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సభ్యులు వొరగంటి ఆనంద్ సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలం, బేగంపేట గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ బెజ్జంకి కమల యొక్క గర్భస్థ కవల శిశువుల మరణాలపై దినపత్రికలో వచ్చిన కథనాలపై రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించింది. 

ఈ రోజు  కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాత శిశు ఆసుపత్రిని విచారణ నిమిత్తం కమిషన్ సభ్యులు వోరగంటి ఆనంద్, భారతి గార్లు సందర్శించి బాలింతను, వారి కుటుంబ సభ్యులను, వైద్యులను జరిగిన సంఘటన పై వివరాలు సేకరించారు, వాంగుల్మం నమోదు చేసుకోన్నారు, సిద్దిపేట, గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి పూర్తి వివరాలు పరిశీలించి బాధ్యలపై చర్యలు తీసుకొంటామని తెలిపారు, ఈలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని వైద్య సిబ్బందిని కమిషన్ సభ్యులు వొరగంటి ఆనంద్  హెచ్చరించారు, 

వారి వెంట కమిషన్ సభ్యురాలు భారతి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ జివెరియా, ఆర్ ఎం ఓ డాక్టర్ సవరయ్యా , హాస్పిటల్ ఇంచార్జీ డాక్టర్ నికత్, పరిపాలన అధికారి డాక్టర్ అలిం, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post