బలాదూరుగా తిరిగే వారికి క్వారైన్టెన్ కేంద్రంలో ఆతిత్యం తప్పనిసరి : కమిషనర్ వి. బి. కమలాసన్ రెడ్డి కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ న్యూస్ : ఒక వైపు కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను తీస్తూ కుటుంబాలను విచ్చిన్నం చేస్తూ, ఒకే కుటుంబంలో భార్యాభర్తలు,  తండ్రి కొడుకులు, తల్లి బిడ్డలను బలి తీసుకుంటుండగా,  ప్రజలు ఆందోళనతో, ఈ మహమ్మారి పీడ విరగడ కావాలని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భయం భయంగా కాలం వెళ్ళ దీస్తున్నారు. మరికొంతమంది అవేమీ పట్టనట్టు కరోనాతో తమకు సంబంధం లేదన్నట్టు తాము నిక్షేపంగా  ఉంటే చాలు, పక్క వాడు ఏమైనా ఫరవా లేదు అన్నట్టు బాధ్యతా రాహిత్యంతో లాక్ డౌన్ నిబంధనలు గాలికి వదిలి బలాదూరుగా బయట తిరుగుతూ కరోన వ్యాప్తికి కారణమవుతున్నారు. వారి  కుటుంబాలను కూడా కరోనా బారిన పడేల చేస్తున్నారు. 


ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొనుటకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి. బి. కమలాసన్ రెడ్డి  దృఢనిశ్చయంతో  పకడ్బందీగా కార్యాచరణ తయారు చేశారు. అందులో భాగంగా; 


 లాక్ డౌన్ సడలింపు సమయం దాటిన తర్వాత 10-00 గంటల నుండి  కరీంనగర్ పట్టణంలో పోలీసు తనిఖీలు ముమ్మరంగా చేయుటకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడమైనది !


  పోలీస్ తనిఖీలలో  అకారణంగా,  కుంటిసాకులతో బయట తిరుగుతూ కనబడితే వారిని  పట్టుకొని వారి వాహనం స్వాధీనం చేసుకో బడుతుంది !


 వాహనం స్వాధీనం చేసుకొని,  చట్టప్రకారం వారిపై  ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్, మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆక్ట్ ల క్రింద కేసు నమోదు చేసి,  జప్తు చేసిన వాహనాన్ని కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది!


 ఆకారణంగా తిరుగుతూ పట్టుబడిన వ్యక్తులను ప్రభుత్వ  ఆధీనంలో నడుపబడుతున్న ఐసోలేషన్ సెంటర్ కు తరలించి అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు!


 వైద్య పరీక్షలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉండి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయితే వారికి వైరస్ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేవరకు ఐసొలేశన్  సెంటర్ లోనే చికిత్స అందిస్తూ,  నిర్బంధంలో ఉంచడం జరుగుతుంది!


  పట్టు బడిన వారిలో కరోనా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినవారికి వైద్యులు మరియు మానసిక విశ్లేషకుల తో  కౌన్సిలింగ్ నిర్వహించి వారినీ  ఇంటికి పంపడం జరుగుతుంది. కానీ వారి వాహనం కోర్టు లో డిపాజిట్ చేయబడుతుంది!


కావున బాధ్యతారాహిత్యంగా,. బలాదూరుగా తిరిగే వారిని తమ పద్ధతి మార్చుకోమని, కరోనా వల్ల జరిగే తీవ్ర నష్టాన్ని మరియు పరిణామాలను గమనించి జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాము!!0/Post a Comment/Comments

Previous Post Next Post