వ్యవసాయ మార్కెట్ ను సందర్శించిన బిజెపి మండల అధ్యక్షులు దోనె అశోక్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో గల వ్యవసాయ మార్కెట్ ను బిజెపి మండల అధ్యక్షులు దోనె అశోక్ సందర్శించడం జరిగింది. మార్కెట్ యార్డులో గోనె సంచులు లేక ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నారు. తాలు పేరుతో, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారు. మార్కెట్ యార్డ్ నిర్వహిస్తున్న టువంటి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వారు రైతులకు టర్ప లిన్ ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు చేస్తున్నారు . వర్షాకాలం ప్రారంభమైన సందర్భంలో   మార్కెట్ యార్డ్ లో ఉన్నటువంటి వరి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించి రైతులకు సహకరించాలని భారతీయ జనతా పార్టీ తరపున ప్రభుత్వాన్ని బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ వారిని డిమాండ్ చేస్తున్నాం. ఇట్టి కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు సంగ రవి మరియు రైతులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post