కుర్నపల్లిలో మావోయిస్టు మిలిషియా సభ్యుల అరెస్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు మావోయిస్టు మిలిషియా సభ్యులను అరెస్టు చేసిన చర్ల పోలీసు సిబ్బంది. మంగళవారం ఉదయం కుర్నపల్లి అడవి ప్రాంతంలో  తమ పోలీసు సిబ్బంది, సిఆర్పిఎఫ్ 141 బిఎన్ బృందం కూంబింగ్ నిర్వహిస్తుండగా తారస పడిన  ఐదుగురు వ్యక్తులను గుర్తించి, పట్టుకొని, విచారించి అరెస్ట్ చేసినట్టు తెలిపిన చర్ల  పోలీసులు . పట్టుబడిన ఐదుగురు ఛత్తీస్గఢ్ రాష్ట్రం, కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధి, నిమ్మలగూడెం గ్రామానికి  చెందిన కొవ్వాసి అడమయ్య @అడమ(24), మడకం దుర్గారావు@దుర్గేష్(20), వేకో సూల@లచ్చ(24), ఊకే సారయ్య(22), మడివి గంగయ్య(35) అనే వ్యక్తులుగా, వీరు కొంతకాలంగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి మిలిషియా సభ్యులుగా కొనసాగుతూ తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులోని చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల గ్రామాలలో సంచరిస్తూ పోలీసుల కదలికల గురించి మావోయిస్టు పార్టీ సభ్యులకు చేరవేస్తూ సరిహద్దుల్లో మావోయిస్టు సభ్యుల ఆదేశాల మేరకు  నిమ్మలగూడెం, పుట్టపాడు, జెట్టిపాడు, డోకుపాడు, బత్తినపల్లి, బట్టిగూడెం, చెన్నాపురం తదితర గ్రామాలకు చెందిన ఇతర మిలిషియా సభ్యులతో కలిసి పలు విధ్వంసకర చర్యల్లో పాల్గొన్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఐదుగురు మిలిషియా సభ్యులను మంగళవారం సాయంత్రం ఎఎస్పి ఎదుట హాజరు పరిచారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post