కొడుకు చేతిలో గాయపడిన తండ్రి చికిత్స పొందుతూ మృతి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామానికి చెందిన కోతి నర్సయ్య 70 సం,,అతని కుమారుడు కోతి కొమురయ్య ఈనెల 21వ తేదీన కర్రతో తలపై మోదడం తో నర్సయ్య తీవ్రంగా గాయపడగా అతనిని కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తుండగా బుధవారం నర్సయ్య మృతి చెందాడు తండ్రి కొడుకులకు గత కొద్దిరోజులుగా మాటలు లేవు తరాజు కోసం నర్సయ్య తన కుమారుని ఇంటికి వెళ్లగా ఇద్దరి మధ్య గొడవ కావడంతో కుమారుడు కొమురయ్య తండ్రి నర్సయ్య తలపై కర్రతో దాడి చేశాడు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తుండగా ఆయన మృతి చెందాడు మృతుని భార్య కనకవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా సిఐ శశిధర్ రెడ్డి గ్రామంలో దర్యాప్తు చేపట్టారు వీరి వెంట ఎస్ఐ ఆవుల తిరుపతి ఉన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post