"అక్రిడిటేషన్ లేని వారు కూడా విలేఖరులే" కేంద్ర ప్రభుత్వం గుర్తించిన,RNI సర్టిఫికెట్ కలిగిన, పత్రికల్లో పనిచేసే వారు విలేఖరి లే..


మరి RNI సర్టిఫికెట్ దానికి ఎటువంటి విలువ లేదా?   వారు సంపాదకులు కాదా? అక్రెడిటిటేషన్ కన్నా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన R.N.I.కె  విలువ  ఎక్కువ. అక్రెడిటిటేషన్ బస్సులో ప్రయాణించడానికి, రైలు లో ప్రయాణించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది...


ఎడిటర్ ఇచ్చే పాస్ కి విలువ ఎక్కువ. అక్రెడిటిటేషన్ బ్రహ్మ పదార్థమైనట్లు  అక్రెడిటిటేషన్ ఉంటేనే వారు జర్నలిస్టులు అనే సంప్రదాయం ఏదైతో ఉందో అది మనిషి యొక్క ప్రాథమిక విధులను‌భంగం కలిగించడమే...


ఈ రోజు అక్రెడిటిటేషన్ ఉంటేనే నిజమైన రిపోర్టర్ లేకపోతే నకిలీ రిపోర్టర్ అని పోలీసులను, ప్రజలను ప్రక్క తోవ పట్టించి... అక్రెడిటిటేషన్లు లేని తోటి రిపోర్టర్స్ ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారట...


వీరికి నాకో ప్రశ్న..?


దయచేసి ఎవ్వరు తప్పుగా అనుకోకండి  ఇది తోటి రిపోర్టర్స్ చేసే వ్యాఖ్యలకు స్పందించి అడుగుతున్నాము..


కొంచం రాగద్వేషాలు లేకుండా అన్ని చోట్లా  ఒకరినొకరు మనమే కలుపుకొని ఐకమత్యంగా నిలబడదాం..


అక్రెడిటిటేషన్ ఉన్న విలేఖరులారా...అక్రెడిటిటేషన్ లేకపోతే రిపోర్టర్స్ కాదని ఎక్కడైనా... ఏమైనా రూల్ రాసి పెట్టి ఉందా...? ఉంటే కొంచెం చూపించండి?


పేపర్... ఛానల్ లకు ఇన్ని అక్రెడిటిటేషన్లు ఇవ్వాలి అని లిమిట్ ఉంటుంది. మరి అక్రెడిటిటేషన్లు లేనివారందరు రిపోర్టర్స్ కారా...?


పని చేసే సంస్థ గుర్తింపు కార్డ్... లెటర్ ఇవ్వనిది అక్రెడిటిటేషన్లు ఎలా వస్తాయి...


నకిలీ రిపోర్టర్స్ అని నెత్తి, నోరు కొట్టుకుంటున్నారు. రిపోర్టర్లకి సంస్థ గుర్తింపు కార్డ్ ఉండగా నకిలీ అని ఎలా అంటారు...?


ఫ్రెండ్స్ నకిలీ జర్నలిస్ట్ అంటే ఆ సంస్థలో పని చేయకుండా ఆ సంస్థ పేరు చెప్పుకొని తిరిగే వాళ్ళు నకిలీ జర్నలిస్టులు అది గుర్తుంచుకోండి...


అక్రెడిటిటేషన్ రాకపోయినా ఆ సంస్థ ఐడి కార్డు ఉంటే చాలు అక్రెడిటిటేషన్ కొలమానం కాదు...


అక్రెడిటిటేషన్ లేనివారు పెట్టింది వార్త కావడం లేదా...?మావి పత్రికలు, ఛానెల్స్ కానప్పుడు  గవర్నమెంట్ ఎందుకు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు...?వారికి లేని బాధ మీకెందుకు...?అసలు అక్రెడిటిటేషన్ అంటే ఏమిటో... సంస్థ గుర్తింపు కార్డ్ అంటే ఏమిటో ముందు తెలుసుకోండి..


మీ దమ్ము అన్నది మీ వార్తలో చూపించండి.మీ దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఎన్నో చట్టవ్యతిరేకమైన పనులు జరుగుతున్నాయి వాటిని భయటపెట్టండి..


రాజకీయ నాయకులకు తొత్తులుగా ఉండకుండా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడండి..


మీ ప్రతాపాలు తోటి రిపోర్టర్స్ పైన కాకుండా అవినీతి పైన చూపించండి. మనలో మనకు ఐక్యత లేకనే  మనం అందరికి చులకన అయిపోతున్నాం...


అయ్య మీరు ముఖ్యంగా ఈ విషయాలు తెలుసుకొండి.


ఒక సంస్థ కొన్ని లక్షల పెట్టి ఛానల్ లేదా పత్రిక  స్థాపించి,ప్రభుత్వం చేత పర్మిషన్స్ తీసుకొని, పూర్తి అవగాహనతో ఉన్న రిపోర్టర్స్ ని నియమించుకొని, సంస్థ ఐడి కార్డ్ మరియు లోగో ఇచ్చి న్యూస్ కొరకు వస్తే నకిలీ రిపోర్టర్స్ అని ఎలా చెప్పగలరు.?


దయఉంచి గమనించండి.. ఒక ఛానల్ లో ఒక జిల్లాలో 100 మంది పనిచేస్తారు కానీ నిర్దేశిత ప్రకారం కొన్ని  అక్రెడిటిటేషన్ కార్డులను మాత్రమే మంజూరు చేయపడుతుంది.. మిగిలిన రిపోర్టర్స్ అందరూ నకిలీ నా..?


ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పవల్సింది ఏంటి అంటే అక్రెడిటిటేషన్ ఎప్పటికీ జర్నలిస్టుకు ప్రామాణికం కాదు...


అతను రాసే వార్తలే ప్రామాణికం..


వార్త లో సత్తా ఉండాలి..ఇక మీ కలానికి పదును పెట్టండి... కత్తిలా మార్చండి.. చెత్త రాజకీయాలను వదిలివేసి, మరల విలేఖరి అనే పదానికి సమాజంలో గౌరవం కలిపిద్దాం ...

0/Post a Comment/Comments

Previous Post Next Post