ఖాసీంపెట్ గ్రామంలో మన ఆపద్బంధువు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు బియ్యం అందజేత కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపెట్ గ్రామానికి  చెందిన ఆకెన శంకరయ్యా -లచవ్వ కుటుంబం నిరుపేద కుటుంబం కొడుకులు,బిడ్డలు ఎవరు లేరు. ఇల్లు కూడా సరిగా లేదు. కుల వృత్తి చేసుకుంటేనే జీవనం కొనసాగిస్తారు అసలే  లాక్ డౌన్ కారణంగా వృత్తి పని ఆగిపోవడంతో తినడానికి తిండి లేక అవస్థలు పడుతూ జీవితాన్ని గడుపుతున్నారు విషయం తెలుసుకున్న మన ఆపద్బంధువు ఫౌండేషన్  సభ్యులు  ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి 25kg ల బియ్యము,14రకాల నిత్యావసర సరుకులు అందజేశారు ఈకార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు  అఖిల్, నగునూరి శంకర్ , చుక్కయ్య,సంతోష్, అనిల్ పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post