తెలంగాణను వైపు కూడా మనసు పెట్టండి .. ప్రజలు మన వైపే చూస్తున్నారు : టిడిపి నేత చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  పాలనతో తెలంగాణ ప్రజలు విసుగెత్తిపోయి ఉన్నారని, ఇక్కడి ప్రజలు మళ్లీ టీడీపీవైపు చూస్తున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. కాబట్టి తెలంగాణను కూడా పట్టించుకోవాలని అధినేత చంద్రబాబుకు సూచించారు. నిన్న ప్రారంభమైన టీడీపీ మహానాడులో టీటీడీపీ నేతలు మాట్లాడుతూ ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.టీడీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలు మనవైపే చూస్తున్నారని నేతలు దుర్గాప్రసాద్, జ్యోజిరెడ్డి, కృష్ణమోహన్, అరవింద్ కుమార్ గౌడ్, తాజొద్దీన్ తదితరులు పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ టీడీపీకి ఉన్న స్థానం ఎప్పటికీ ప్రత్యేకమైనదని, పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయమని తాజొద్దీన్ పేర్కొన్నారు.
0/Post a Comment/Comments

Previous Post Next Post