ఈటల కుమారుడి పై భూకబ్జా ఆరోపణలు - రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్, విజిలెన్స్ అధికారులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డాడంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై అధికారులు విచారణ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్, విజిలెన్స్ విభాగాలకు చెందిన ముగ్గురు అధికారులు నిన్న విచారణ మొదలుపెట్టారు. మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డులను పరిశీలించిన అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రావల్‌కోట్‌లో ఆరోపణలున్న 10.11 ఎకరాల భూమిని పరిశీలించారు.ఆ భూమిలో 5.22 ఎకరాలు ఈటల కుమారుడి పేరుపైన, మిగతా భూమి సాదా కేశవరెడ్డి పేరుపైన ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు, భూమిని సర్వే చేసేందుకు వచ్చిన సర్వేయర్‌‌ను అక్కడి కాపలాదారులు అడ్డుకున్నారు. ముందస్తు నోటీసు లేకుండా సర్వేకు ఎలా వస్తారని కేశవరెడ్డి ప్రశ్నించడంతో చేసేది లేక సర్వేయర్ వెనుదిరిగారు. ఇక, నితిన్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేసిన మేడ్చల్ జిల్లా రావల్‌కోట్‌కు చెందిన పిట్ల మహేశ్‌ను తహసీల్దార్ కార్యాలయానికి పిలిచి వివరాలు సేకరించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post