బ్రిడ్జి వెంటనే నిర్మించాలని సిపిఐ నాయకుల డిమాండ్ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ నుంచి పీచుపల్లి వెళ్లే రహదారి మధ్యలో ఉన్న బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలని సిపిఐ మండల కార్యదర్శి కాంతల అంజి రెడ్డి అన్నారు  సోమవారం ఆయన  మాట్లాడుతూ రహదారి మధ్యలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టకపోవడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత అధికారులు వెంటనే కాంట్రాక్టర్ పైన చర్య తీసుకొని వెంటనే బ్రిడ్జి పనులు ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో కొండాపూర్ రహదారిని దిగ్బంధిస్తామని సిపిఐ నాయకులు హెచ్చరించారు ఇట్టి కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి చొక్కాల్లా శ్రీశైలం సిపిఐ మండల నాయకుడు మొలుగురి సంపత్.వీరి వెంట గ్రామ ప్రజలు సామ లక్ష్మారెడ్డి. సామ రామి రెడ్డి.సామ రవీందర్ రెడ్డి సామా లచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు.0/Post a Comment/Comments

Previous Post Next Post