జంగపల్లి గ్రామంలో కరోనా పరీక్షలు - పాజిటివ్ వచ్చినవారు అధైర్యపడవద్దు హెల్త్ సూపర్వైజర్ వి. సంపత్ రెడ్డికరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం : పాజిటివ్ వచ్చినవారు అధైర్యపడవద్దు అని హెల్త్ సూపర్వైజర్ వి. సంపత్ రెడ్డి ప్రజలను కోరారు. సోమవారం మండలంలోని జంగపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల లో 105 మంది ప్రజలకు కరోనా పరీక్షలు చేయగా జంగపల్లి లో 10 మందికి, హన్మాజిపల్లి 7, గన్నేరువరం 5, చీమలకుంటపల్లి 2, మొత్తం 24 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. మందులు వేసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియజేయాలని కోరారు. ఈకార్యక్రమంలో ఎస్. శ్రీనివాస్, శ్రీకాంత్, సుజాత. లావణ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు.
0/Post a Comment/Comments

Previous Post Next Post