వలస కార్మికులకు నిత్యావసర సరుకులు... నగదు పంపిణీ చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కరీంనగర్ జిల్లా మానకొండూర్ ది రిపోర్టర్ టీవీ న్యూస్ :కరోన మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన మహారాష్ట్రకు చెందిన వలస కార్మికులకు ఈరోజు నిత్యావసర సరుకులతో పాటు కొంత నగదును అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ 


తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో ఇటీవల జరిగిన శ్రీ.లక్ష్మీనరసింహ్మ స్వామి జాతరలో మహారాష్ట్రకు చెందిన నిర్వాహకులు రంగుల రాట్నం నిర్వహించారు. లాక్ డౌన్ కారణంగా మహారాష్ట్రకు వెళ్లలేక ఇక్కడే కూలి పని చేసుకుంటూ బతుతున్నారు


సమాచారం అందుకున్న మంచి మనసున్న ప్రజానాయకులు రసమయి ఈరోజు నేరుగా వారి వద్దకు వెళ్లి బియ్యం, కూరగాయలు, కోడి గుడ్లతో పాటు కొంత నగదును అందజేశారు ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.0/Post a Comment/Comments

Previous Post Next Post