AP NEWS

సమ్మె విరమించుకోనున్న ఉద్యోగులు!

ఆంధ్రప్రదేశ్ మంత్రుల కమిటీ, ఉద్యోగుల మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. సుదీర్ఘంగా 7 గంటల పాటు సాగిన చర్చలు సఫలం అయ్యాయి. మంత్రుల కమిటీతో కుదిరిన ఒప్పందం మేరకు ఉద్యోగ సంఘాలు సమ్మెను విరమించుకోనున్నాయి. దీనిపై మంత్రుల కమిటీ, పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు సంయుక్తంగా మీడియా సమావేశంలో ప్రకటించనున్నారు.

శనివారం మధ్యాహ్నం నుంచి జరుగుతున్న చర్చల్లో హెచ్ఆర్ఏ శ్లాబులపై ప్రతిష్టంభన తొలగించేందుకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కాగా, చర్చల అనంతరం మంత్రుల కమిటీ సీఎం జగన్ కు చర్చల వివరాలు తెలిపింది. ఆపై, ఆయన ఆన్ లైన్ లో ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడారు.