CINEMA

‘మేజర్’గా కనిపించనున్న అడివి శేష్ … ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు!

అడివి శేష్ హీరోగా .. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో ‘మేజర్’ సినిమా రూపొందింది. మహేశ్ బాబు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. ముంబైలోని ఒక హోటల్ పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో నడిచే కథ ఇది.

ఈ సినిమా విడుదలకు సరైన డేట్ కోసం వెయిట్ చేస్తూ వస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ .. మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక ప్రోమో కట్ వదిలారు.

శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో కథానాయికగా సయీ మంజ్రేకర్ .. ముఖ్యమైన పాత్రలో శోభిత ధూళిపాళ కనిపించనున్నారు. ప్రకాశ్ రాజ్ .. మురళీశర్మ కీలకమైన పాత్రలను పోషించారు. చాలా కాలం తరువాత ఒక ప్రత్యేకమైన పాత్రలో రేవతి కనిపించనుండటం విశేషం.