ARTICLES NATIONAL

మీడియాను ఎవరూ అడ్డుకోలేరు… సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు…

న్యూ ఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జరగిన చర్యల నుంచి మీడియా ను నియంత్రించ లేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యా నించింది. ఎన్నికల కమీషన్ వేసిన పిటీషన్ పై సోమవారం విచారణ అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం పై విధంగా వ్యాఖ్యా నించింది. ప్రజాస్వామ్య నాలుగు మూలస్థంభాల్లో మీడియా ఒకటని కోర్టుల్లో జరిగే విషయాలను ప్రజలతో మీడియా కమ్యూనికేట్ చేయగలదని జస్టిస్ వై.వి. చంద్రచూడ్,జస్టిసాలతో కూడాన బెంచ్లో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొద్దిరోజుల క్రితం ఎన్నికల ర్యాలీల విషయమై మద్రాస్ హైకోర్టు స్పందిస్తూ “మీపై హత్యానేరం ఎందుకు మోపకూడదు?” అంటూ కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్రంగా విరుచుకపడ్డ విషయం తెలిసిందే. అయితే మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల పై సుప్రీం గడపను ఈసీ తొక్కింది. అనంతరం సుప్రీం స్పందిస్తూ “కోర్టుల్లో ఏం జరిగిందన్న విషయాన్ని మీడియా పూర్తి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కోర్టులకు సంబంధించిన అంశాలను ఇది రిపోర్టు చేయజాలదని అనలేం.మీడియా చాలా శక్తివంతమైంది…

అందుకే ప్రతి వ్యవస్థను ప్రజలతో అనుసంధానం చేసే సాధనం మీడియా అని అందుకే దానిని నియంత్రించలేమని” సుప్రీం ధర్మాసనం పేర్కొంది…!!