CINEMA

‘బ్రహ్మాస్త్ర’కు చిరంజీవి వాయిస్ ఓవర్ … చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన నాగార్జున

బాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ బ్రహ్మాస్త్రలో టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున కూడా నటించడం తెలిసిందే. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ చిత్రం తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో వస్తోంది. తొలి భాగాన్ని ‘బ్రహ్మాస్త్రం మొదటి భాగం: శివ’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి తన గొంతు అరువిచ్చారు. ఈ సినిమా కోసం ఆయన వాయిస్ ఓవర్ అందించారు.

దీనిపై నాగార్జున స్పందిస్తూ, చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపారు. “డియర్ చిరంజీవి…. మీరెప్పుడూ ఓ మంచి స్నేహితుడిగా, నా కుటుంబానికి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు కూడా, అడగ్గానే స్పందించి బ్రహ్మాస్త్ర చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. తద్వారా ఈ చిత్రానికి మరింత భారీతనం తెచ్చిపెట్టారు. థాంక్యూ” అంటూ నాగ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రం ట్రైలర్ జూన్ 15న వస్తోందని వెల్లడించారు.