TELANGANA

రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎంతో మాట్లాడతా: కేటీఆర్

రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో నిర్వహించిన రెడ్డి సంఘం ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని కులాల్లోనూ పేదవాళ్లు ఉన్నారని, రెడ్డి కులం కూడా అందుకు మినహాయింపు కాదని స్పష్టం చేశారు. రెడ్డి సామాజిక వర్గం పేరుకు అగ్రవర్ణమే అయినా, రెడ్లలోనూ పేదలు ఉన్నారని తెలిపారు. రెడ్డి సామాజిక వర్గ సంక్షేమం కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. దీనిపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

తన శరీరంలో శక్తి ఉన్నంతవరకు ప్రతి కుల సంక్షేమం కోసం పాటుపడతానని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా కేసీఆర్ పాలన సాగుతోందని, పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని కేటీఆర్ ఉద్ఘాటించారు.