TECHNOLOGY TELANGANA

మౌల్డ్ షాప్ మరియు డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ ని ప్రారంభించిన కేటీఆర్

సంగారెడ్డి జిల్లా,పటాన్ చెరునియోజకవర్గం : పటాన్ చేరు మండలం ఐడిఎ పాశమైలారం ఆల్ప్లా పరిశ్రమలో నూతనంగా మౌల్డ్ షాప్ మరియు డ్యూయల్ ఎడ్యుకేషన్ సెంటర్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో ఐదు విప్లవాలు వచ్చాయి తెలిపారు.

  • సశ్య విప్లవంతో లక్షల ఎకరాల సాగులోకి వచ్చాయి.
  •  దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ.
  • నీలి విప్లవంతో మన దేశ అవసరాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో చేపల ఉత్పత్తి ఉంది.
  •  క్షిర విప్లవంతో రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరిగింది.
  •  రాష్ట్రం వచ్చే నాటికి అప్పులతో మూతపడే దశలో ఉన్న విజయా డైరీ.. నేడు ప్రభుత్వానికి డివిడెంట్ ఇచ్చే స్థాయికి ఎదిగింది.
  •  గులాబీ విప్లవంతో మాంసం ఉత్పత్తి పెరిగింది.
  •  పశుపోషణలో అనుభవం ఉన్న యాదవ, కురుమలను ప్రోత్సాహించడంతో రాష్ట్రంలోని పశు సంపద రెట్టింపు అయ్యింది.
  •  పసుపు విప్లవంతో రాష్ట్రంలో నూనె గింజల ఉత్పత్తి పెరగనుంది.
  •  వచ్చే 5సంవత్సరాల్లో 25లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నాం.
  • రాష్ట్రంలోని పారిశ్రామిక వెత్తలపై, పెట్టుబడిదారులపై ఎలాంటి వత్తిడి లేదు.
  •  ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నాం.
  •  రాష్ట్రంలో స్థిర, సామర్ధ్యం ఉన్న ప్రభుత్వం వల్ల జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు అధికంగా ఉంది.
  • తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధి జరగాలని ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం.
  •  దిగుమతులు తగ్గించి.. స్థానికంగానే ఉత్పత్తి పెంచి.. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు , అధికారులు పాల్గొన్నారు