ANDHRA PRADESH NATIONAL TELANGANA WORLD

ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న అతి పెద్ద డిజిటల్ ఆర్ట్ వీడియో

డిజిటల్ ఆర్ట్.. డిజిటల్ ఆర్ట్ లు మామూలే.. కాస్త జూమ్ చేస్తే అంతటితో బొమ్మ అయిపోతుంది. మరీ పెద్దదో, హైక్వాలిటీదో అయితే.. రెండు, మూడు రెట్లు జూమ్ చేసినా బాగా కనిపిస్తుంది. కానీ ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన ఓ డిజిటల్ ఆర్ట్ మాత్రం నెటిజన్లకు షాకిస్తోంది. అంతా ఇంతా కాదు జూమ్ చేసిన కొద్దీ కొత్త కొత్త చిత్రాలు కనిపిస్తూ.. మరింత అందంగా ఆకట్టుకుంటోంది.

ఒకదాని వెనుక మరో చిత్రం:
ఓ వ్యక్తి ఫోన్ లో వేళ్లతో ఈ డిజిటల్ ఆర్ట్ ను జూమ్ చేస్తూ వెళ్తున్నట్టుగా ఈ వీడియోలో ఉంది. ఒకదాని వెనుక ఒకటిగా చిత్రాలు వస్తూనే ఉండటంతో.. వీడియో చూసినవారు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అంతేకాదు.. ఎంతగా జూమ్ చేస్తూ, ఎన్ని చిత్రాలు వస్తున్నా వాటి నాణ్యత కూడా దెబ్బతినకుండా స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం. ‘వస్కాంగే’ పేరిట ఉన్న ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీనికి భారీ సంఖ్యలో వ్యూస్, రీట్వీట్లు వస్తున్నాయి.

  • డిజిటల్ ఆర్ట్ అద్భుతంగా ఉందని కొందరు పొగుడుతుంటే.. ఈ ట్రిక్ ఏమిటో చెప్పాలంటూ మరికొందరు అడుగుతున్నారు.
  • ఆ వీడియోను సృష్టించినవారు ఎవరోగానీ చాలా జాగ్రత్తగా రూపొందించారని.. ఎక్కడా అనుమానం రాకుండా చాలా చిత్రాలను ఒకే చిత్రంలో జూమ్ చేసి చూపిస్తున్నట్టుగా అమర్చారని కొందరు కామెంట్లు చేస్తున్నారు.