NATIONAL TELANGANA

మూడు గంటల హైడ్రామా….పోలీస్ స్టేషన్ నుంచి ఇసుక మాఫియా బెంజ్ మాయం .. !

  • పర్మిషన్ “పేటకు”….పోయేది కర్ణాటకకు
  •  మగానూర్ లో రెచ్చిపోతున్న….ఇసుక మాఫియా
  •  కాంట్రాక్టర్ వాళ్ళు ఫోన్ చేశారు…..పంపించేశా: ఎస్ఐ నరేందర్
  •  పర్మిషన్ వస్తుందన్నారు….పంపించ్చా
  •  అనుమతి పేరుతో….4 రోజులుగా అక్రమ ఇసుక దందా
  •  పర్మిషన్ పేరిట……పక్కదారులు
  •  అక్రమార్కులకు… అధికార నేతల అండదండలు
  •  10 భారత్ బెంజ్ లతో దర్జాగా ఇసుక అక్రమ రవాణా
  •  చోద్యం చూస్తున్న రెవిన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు
  •  నారాయణపేటకు మాత్రమే అనుమతి ఇచ్చాం…. కర్ణాటకకు కాదు: తహసీల్దార్ తిరుపతి
  •  ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటాం
  •  సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్

నారాయణపేట జిల్లా మాగనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక మాఫియా మళ్ళీ, మళ్ళీ రెచ్చిపోతున్న పట్టించుకొనే నాధుడే కరువయ్యారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…..నారాయణపేట
జిల్లా కేంద్రంలోని మునిసిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీల మరమ్మతుల కోసం మగానూర్ మండలం వర్కర్ గ్రామ శివారులో గల పెద్ద వాగు నుండి నారాయణపేట జిల్లా కేంద్రానికి TS 38 T 0400 భారత్ బెంజ్ టిప్పర్ తో కేవలం రెండు ట్రిప్పులకు మాత్రమే నారాయణపేట కలెక్టర్ నుండి కొందరు ప్రభుత్వ అనుమతులు పొందారు.

ఇక్కడి నుండే అసలు కథ మొదలైతుంది. మగానూర్ మండలం వర్కర్ గ్రామ శివారులో గల పెద్ద వాగు నుండి ప్రభుత్వం నుండి కేవలం రెండు ట్రిప్పులను అడ్డం పెట్టుకొని రంగంలోకి దిగిన ఇసుక మాఫియా, నారాయణపేట మున్సిపాలిటీ పనులు పక్కనపెట్టి….రాయచూరు, కర్ణాటకకు టిప్పర్లు బాట పట్టాయి. గత 4, 5 రోజులుగా దాదాపు 10 టిప్పర్ల ఇసుకను కర్ణాటకకు ఇసుక మాఫియా అక్రమంగా తరలించింది. నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన ఇసుక, అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండానే కర్ణాటకకు ఇసుక మాఫియా భాజాప్త పట్టపగలు తరలిస్తున్న…..పట్టించుకొనే నాథుడే కరువయ్యారు.

ప్రభుత్వ అనుమతుల పేరుతో అక్రమ ఇసుక దందాకు తెరలేపిన ఇసుక మాఫియా….పర్మిషన్ ఒకచోట….పోసేది మరొకచోట అన్న విదంగా….నారాయణపేటకు వెళ్లాల్సిన ఇసుక కర్ణాటకకు చేరుకొంది. ఈ ఇసుక మాఫియాకు…అధికార నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో అటువైపు వెళ్లేందుకు రెవిన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు జంకుతున్నారు.

కాంట్రాక్టర్ వాళ్ళు ఫోన్ చేశారు…..పంపించేశా: ఎస్ఐ నరేందర్:

ఇదిలాఉంటె మగానూర్ మండలం వర్కర్ గ్రామ శివారులో గల పెద్ద వాగు నుం నారాయణపేట జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన ఇసుక, అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండానే గత గురువారం ఇసుక మాఫియా పట్టపగలు KA 33 A 4344 భారత్ బెంజ్ వాహనంలో కర్ణాటకకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనాన్ని తనిఖీ చేసి, అనుమతులు లేవని ఎస్ఐ సదురు బెంజ్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం గంటలకు పోలీస్ స్టేషన్ తరలించిన సదురు బెంజ్ గంటల హైడ్రామా అనంతరం మధ్యాహ్నం మాగనూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇసుక మాఫియా KA 33 A 4344 భారత్ బెంజ్ మాయం అయ్యిoది

ఈ విషయంపై సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ మాగనూర్ ఎస్ఐ నరేందర్ ను వివరణ కోరగా, కాంట్రాక్టర్ వాళ్ళు ఫోన్ చేశారు పర్మిషన్ ఉందన్నారు అందుకే
పంపించేశానని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ, పర్మిషన్ కాపీ పంపుతా అన్న ఎస్ఐ నరేందర్….అనంతరం ఎన్ని సార్లు ఫోన్ చేసినా….. ఫోన్ ఎత్తకపోవడం గమనార్హం.

నారాయణపేటకు మాత్రమే అనుమతి ఇచ్చాం…. కర్ణాటకకు కు కాదు: తహసీల్దార్ తిరుపతి:

మగానూర్ మండలం వర్కర్ గ్రామ శివారులో గల పెద్ద వాగు నుండి నారాయణపేట కోసం ప్రభుత్వంతో ఇసుక రవాణాకు అనుమతులు పొంది, అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారని మగానూర్ తహశీల్దార్ తిరుపతికి సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ పిర్యాదు చేయగా, మెం కేవలం నారాయణపేటకు మాత్రమే అనుమతి ఇచ్చమని, కర్ణాటకకు కాదని ఆయన స్పష్టం చేశారు. అధికారులు అనుమతులు నారాయణపేటకు పొంది….10 టిప్పర్లుతో యథేచ్ఛగా ఇసుకను కర్ణాటకకు కు బాజాప్త అక్రమంగా ఇసుక రవాణా చేయడం చూస్తే సంబంధిత
అధికారుల…. నిఘా ఏమాత్రం ఉందో స్పష్టం అవుతోంది.

ఇసుక అక్రమ రవాణాను….అడ్డుకుంటాం:

నారాయణపేట జిల్లా మాగనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్న….అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవిన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా, తాపీగా చోద్యం చూస్తున్నారని, గతంలో ఇసుక మాఫియాకు స్థానికంగా కొందరు పోలీసులు కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయన్నారు సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్. ఈ నేపద్యంలో గురువారం ఉదయం నుండి మగానూర్ మండలం వర్కర్ గ్రామ శివారులో గల పెద్ద వాగు 10 టిప్పర్లుతో ఇసుకను అక్రమంగా కర్ణాటకకు తరలించిన…. సంబంధిత రెవిన్యూ, పోలీస్ అధికారులతో పాటు మైనింగ్ అధికారులు చోద్యం చుస్తుండడం దురదృష్టకరమని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాకు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో అటువైపు రెవిన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు వెళ్లేందుకు జంకుతున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నారాయణపేట జిల్లా మగానూర్ మండలం వర్కర్ గ్రామ శివార్లలో గల పెద్ద వాగు నుండి ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటామని …..సామాజిక కార్యకర్త, …” నేనుసైతం” స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

” నేనుసైతం” స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్.