ANDHRA PRADESH

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ : పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి

పల్నాడు జిల్లా నరసరావుపేట చైన్ స్నాచింగ్, దోపిడీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసిన నరసరావుపేట రూరల్ పోలీసులు. గురువారం పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడు పాల్పడిన వివిధ దొంగతనాల వివరాలను వెల్లడించిన ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్, నరసరావుపేట I టౌన్, నాదెండ్ల,రొంపిచర్ల, మరియు నకరికల్లు పోలీసు స్టేషన్ పరిధిలో సుమారు గత ఆరు నెలల కాలంలో వయస్సు పైబడిన ముసలివారు మరియు ఒంటరిగా ఉన్న మహిళల యొక్క మెడలో ఉన్న బంగారపు చైన్ లు లాక్కొని పోవుచున్న దొంగను గుర్తించి నరసరావుపేట రూరల్ CI, P. భక్తవత్సల రెడ్డి కి రాబడిన సమాచారం మేరకు సీఐ ఆద్వర్యంలోని ఎస్సైలు బాల నాగి రెడ్డి,హాజరత్తయ్య మరియు సిబ్బంది ది. 28-07-2022 వ తేదిన సాయంత్రం గం.04.00 గంటలకు నరసరావుపేట మండలంలోని కేసానుపల్లి పంచాయతీ SRKT బైపాస్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని,విచారించగా అతను పాల్పడిన దొంగతనాల గురించి పోలీస్ వారి వద్ద ఒప్పుకోవడం జరిగినది. అతనిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి చోరి సొత్తు బంగారం 210 గ్రాములు (26 సెవర్లు),రికవరీ చేయడం జరిగినది. ముద్దాయి యొక్క వివరములు షేక్ నాగూర్ బాష, @ నాగూర్ బాబు, S/o మౌలాలి, వయస్సు 30 సంవత్సరాలు కూకట్లపల్లి గ్రామము, బల్లికురవ మండలం. బాపట్ల జిల్లా,ఇతను పాత నేరస్తుడు, గతంలో ఇతని పై పలు పోలీస్ స్టేషన్ లలో 10 దొంగతనాల కేసులు నమోదు అయి ఉన్నవి. పై కేసులలో ముద్దాయిని పట్టుకొనుటలో మరియు చోరీ సొత్తును రికవరీ చేయుటలో ప్రతిభ కనపరచిన ఎస్సైలను మరియు సిబ్బందిని SP రవిశంకర్ రెడ్డి, IPS అభినందిచినారు.