TELANGANA

క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో కేసీఆర్‌కు స్పెష‌ల్ చాంబ‌ర్‌ .. సెంట‌ర్‌ కు సీవీ ఆనంద్‌ బాస్

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌లో ఈ రోజు రాష్ట్ర పోలీసు ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ (టీఎస్‌పీఐసీసీసీ)ను ప్రారంభించిన సంగతి విదితమే. భ‌వ‌న నిర్మాణం, భ‌వ‌నంలోని అత్యాధునిక సౌక‌ర్యాలు, నేరాల అదుపున‌కు పోలీసులు తీసుకునే చ‌ర్య‌ల‌కు సంబంధించి ప్ర‌త్యేక ఏర్పాట్లు ఆకట్టుకుంటున్నాయి.

రాష్ట్ర పోలీసు శాఖ‌కు చెందిన క‌మాండ్ కంట్రోల్ అయిన‌ప్ప‌టికీ… దీనికి హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అధిప‌తిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ మేర‌కు ఈ భ‌వ‌నాన్ని కేసీఆర్ ప్రారంభించిన త‌ర్వాత క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ బాస్‌గా ప్ర‌స్తుతం న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్‌గా కొన‌సాగుతున్న సీవీ ఆనంద్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా సీవీ ఆనంద్‌కు సీఎం కేసీఆర్ ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలిపారు.

Image

Image

Image